
దర్శించుకున్న ప్రముఖలు..
అలంపూర్ ఆలయాలను శుక్రవారం ముఖ్యమంత్రి సోదరుడు సోదరుడు తిరుపతిరెడ్డి, సినీనిర్మాత, నటుడు బండ్ల గణేష్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సరిత, డీఎస్పీ మొగులయ్య వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ఆలయాల్లోప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. అదేవిధంగా గద్వాల సంస్థానాధీశుల కుటుంబసభ్యులు అమ్మవారికి నవరాత్రుల్లో అలంకరించేందుకు చీరను అందజేశారు. వీరివెంట ఆలయ ఈఓ దీప్తి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

దర్శించుకున్న ప్రముఖలు..