
లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాకేంద్రంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి పాటుకాల్వలు, డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, లక్ష్మీనగర్‌కాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, బీకేరెడ్డికాలనీ, బీఎన్‌రెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, వెంకటరమణకాలనీ, బాలాజీనగర్, గణేష్‌నగర్, వల్లభ్‌నగర్, కిసాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద పారింది. సంజయ్‌నగర్‌లో ఓ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్లి జేసీబీతో తొలగించారు. అలాగే పెద్దచెరువు (మినీ ట్యాంక్‌బండ్)లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రామయ్యబౌలి వద్ద ఉన్న అలుగు ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్‌ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య తదితరులు పరిశీలించారు.