
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
ప్రతి ఏటా వానాకాలం సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్‌తో పాటు ఆర్డీఎస్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్‌ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి.
– రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక
●