
ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీడ్రా
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈనెల 27 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఉంటుందని తెలిపారు. పై తేదీల్లో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేసిన తర్వాత టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్స్‌లో వేయాలని కోరారు. 8వ తేదీన డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.