
ఇక టెండర్ల జాతర
మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
● మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ విజయేందిర బోయి కులాల వారీగా రిజర్వేషన్‌కు సంబంధించిన దుకాణాలను కేటాయించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో ఉన్న 90 మద్యం దుకాణాలు ఉంటే ఇందులో గౌడ్స్‌కు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు మూడు దుకాణాలు కేటాయించారు. ఈ మేరకు రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో కేటాయించారు.
● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్‌ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి.
కొత్త మద్యం పాలసీకి దుకాణాల కేటాయింపు
నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్ల ఆహ్వానం