
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు
● జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, క్యాథ్‌లాబ్‌కు రూ.18.76 కోట్లు మంజూరు
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా అందుబాటులో లేని ఎంఆర్‌ఐ, క్యాథ్ లాబ్ పరికరాల కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటి ఏర్పాటు కోసం రూ.18,76,80,000 మంజూరు చేస్తూ జీఓ పంపిచారన్నారు. 20 నెలల నుంచి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని, ఈ రంగంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఇటీవలఎంపీ డీకే అరుణతో కలిసి రైల్వేశాఖ సహాయ మంత్రిని కోరినట్లు తెలిపారు. నగరం జనాభా 3 లక్షలు దాటిందని, ఈ మేరకు టీడీగుట్ట, తిమ్మిసానిపల్లి, బోయపల్లి రైల్వే గేటు వద్ద ఆర్‌ఓబీలు నిర్మించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సాధ్యమన్నారు. ఎవరైనా అధికారులపైనా దౌర్జన్యం చేసినా, దుర్భాషాలాడినా సహించేది లేదని, ఇది మహబూబ్‌నగర్ సంస్కృతి కాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు ఎన్‌పీ.వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, గంజి ఆంజనేయులు పాల్గొన్నారు.