
కఠినంగా వ్యవహరిస్తాం
జిల్లాలో శాంతిభద్రతలకు వి ఘాతం కలిగిస్తే సహించేది లేదు. హింసాత్మక దాడులు, అల్లర్లకు పాల్పడిన వారు ఎవ రైనా ఉపేక్షించం. మద్యం, నిషేధిత మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోంది. వారి భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పట్టు బడిన యువతకు కౌన్సిలింగ్ అందిస్తున్నాం. మత్తు పదార్థాల వల్లన జరిగే నష్టాల గురించి వివరిస్తున్నాం. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. క్రయ, విక్రయాలకు పాల్పడిన వ్యక్తులపై కే సులు నమోదు చేసి జైలుకు పంపుతున్నాం. పాత నేరస్తులు, రౌడీషీటర్ల వివరాలను గుర్తించి బైండోవర్ చేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ