
ఆహార పదార్థాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తిను బండారాలు, వివిధ ఆహార పదార్థాలతో వంటల తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్ సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సుమారు 80 మంది వీధి వ్యాపారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వంటకాలు నాణ్యంగా ఉండాలని, శుచి–శుభ్రత పాటించాలన్నారు. చేతికి గ్లౌజ్‌లతో పాటు ఆఫ్రాన్ ధరించాలన్నారు. ఆయా వంటల్లో మేలురకమైన మంచినూనెను వాడాలన్నారు. వివిధ పదార్థాల కొనుగోలు సమయంలో వాటి గడువు తేదీని గమనించి బ్రాండెడ్‌వి మాత్రమే తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు, ఆర్‌పీలు పాల్గొన్నారు.