
పల్లెగడ్డ ప్రజలకు ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి
మరికల్: పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని దేవాదాయ శాఖ గ్రామస్తులకు ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని బుధవారం సీపీఐఎమ్‌ఎల్, మాస్‌లైన్ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐఎమ్‌ఎల్ జిల్లా కార్యదర్శి కాశీనాథ్, మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ పల్లెగడ్డ గ్రామంలో తరతరాలుగా ఉంటున్న 280 కుటుంబాలకు అన్ని రకాల హక్కులు కల్పించాలన్నారు. అన్ని కుటుంబాలు ఏళ్లుగా ఇంటి, నీటి, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం తహసీల్దార్ రాంకోటి మాట్లాడుతూ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సలీం, హన్మంతు, చెన్నయ్య, రాములు, కుర్మయ్య, యాదగిరి, రాము, రామాంజనేయులు, వెంకట్రాములు, హాజిమలాంగ్ పాల్గొన్నారు.
మహిళా
కానిస్టేబుల్‌కు కాంస్యం
మహబూబ్‌నగర్ క్రైం: హర్యానా రాష్ట్రంలో ఈ నెల 20నుంచి 24 వరకు జరిగిన ఆల్ ఇండియా 74వ పో లీస్ రెజ్లింగ్ క్లస్టర్‌లో జిల్లా పో లీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ రాధిక కాంస్య పత కం సాధించారు. తెలంగాణ పోలీస్ మహిళా ఆర్మ్ రెజ్లింగ్ క్రీడకారిణి అడ్డాకుల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ రాధిక క్యాంస పతకం సాధించింది. దీంతో కానిస్టేబుల్‌రాధికను ఎస్పీ జానకి అభినందించారు.
షార్ట్‌సర్క్యూట్: రూ.లక్ష నష్టం
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని టైలర్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిలక్‌గనర్ కాలనీలో నివాసముండే మురళి ఇంటి వద్ద బాలాజీ టైలర్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం మూసి నిద్రించాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిచుట్టూ పొగ కమ్ముకోవడంతో కిందకు వెళ్లి చూశాడు. దుకాణంలో మంటలు వ్యాపించినట్లు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పల్లెగడ్డ ప్రజలకు ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి