జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ వర్కర్స్‌కు పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే ఇవ్వాలని తెలంగా ణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియర్ రా ష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. ఈ మే రకు బుధవారం హైదరాబాద్‌లో పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజనకు వినతిప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగకు తమతోపా టు తమ కుటుంబ సభ్యులు మొత్తం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందికి గ్రీన్ చానల్ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, ఉప ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, మహిళా కన్వీనర్ పద్మమ్మ, జిల్లా నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.
పెరగని ఉల్లి ధర
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు దాదాపు వేయి బస్తా ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ. 1,200 ధరలు నమోదయ్యాయి. కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు కొత్త ఉల్లి రాకతో ధరలు బాగా పడిపోయాయి. దీంతో దేవరక ద్ర మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది. 50 కిలోల బస్తా ధర గరిష్టంగా రూ.850, కనిష్టంగా రూ.600 చొప్పున విక్రయించారు.
ఆముదాల ధర రూ.5,709
దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్ రూ.5,709, హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,701 ఒకే ధర లభించింది.
మొక్కజొన్న క్వింటాల్ రూ.1,913
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.1,913, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలకు గరిష్టంగా రూ.5,906, కనిష్టంగా రూ.5,856, ఉలువలు రూ.3,501 చొప్పున వచ్చాయి.

పెండింగ్ వేతనాలు ఇవ్వాలి