
ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థులకు బాధ్యత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థులు పాల్గొంటే సామాజిక బాధ్యత పెరుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేకు పీయూ ఫార్మసీ ఆడిటోరియంలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌లు గ్రామాలను దత్తత తీసుకుని, వాటిలో అనేక సామాజిక కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. బాల్య వివాహా లు, పారిశుద్ధ్యం, అక్షరాస్యత, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉందన్నా రు. గ్రామాల్లో 7 రో జులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎన్నో అనుభవాలను నేర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. పీయూలో నిర్వహించిన క్యాంపులో పరిసరాలను పరిశుభ్రంగా చేయడం అభినందించ విషయమన్నా రు. రిజిస్ట్రార్ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వలంటీర్స్ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల ని, వాటిద్వారా ప్రకృతికి మేలు జరుగుతుందన్నా రు. చురుకుగా యువ వలంటీర్‌లు పీయూ ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, పాటల పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రదా నం చేశారు. అనంతరం వీసీని ప్రోగ్రామ్ అధికారు లు సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ ప్రవీణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, గాలెన్న, అర్జున్‌కుమార్, రాఘవేందర్, ఈశ్వర్, శివకుమార్, చిన్నాదేవి పాల్గొన్నారు.