
శక్తిస్వరూపిణి.. బ్రహ్మచారిణి
● శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు
● అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
నిత్యపూజల్లో అర్చక స్వాములు
జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
అలంపూర్: జోగుళాంబ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం బ్రహ్మచారిణి దేవిగా దర్శనమిచ్చి భక్తుల చేత విశేష పూజలందుకున్నారు. బ్రహ్మచారిణి మాతగా కొలువుదీరిన అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు కొలువు పూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసినీ పూజ అనంతరం మహామంగళ హారతి, నీరజన మంత్ర పుష్పములు వంటి విశేష పూజలు చేశారు. నవరాత్రుల్లో రెండో రోజు జోగుళాంబ అమ్మవారిని బ్రహ్మచారిణి మాతగా ఆరాధిస్తారని అర్చక స్వాములు తెలిపారు. అమ్మవారు దేవత శుద్ధస్పటిక వర్ణములతో ప్రకాశించే స్వభావాన్ని కలిగి ఉంటారని వివరించారు. అమ్మవారి చేతిలో పుస్తకం, జపమాల, కమండలం, దండం కలిగి ఉంటారని భక్తులకు తెలిజేశారు. అమ్మవారిని పూజించిన వారికి జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదర్కొనే శక్తి లభిస్తుందన్నారు.
ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యానుష్ఠానం, ఆవాహితా దేవత హోమా లు, నిత్య బలిహరణ, అర్చనలు, నీరాజన మంత్ర పుష్పములు, అమ్మవారికి నవాన్న సహిత మహాని వేదన, బలిహరణ సమర్పణ వంటి పూజలు ప్రత్యేకంగా చేశారు. యాగశాలలో నిత్యానుష్ఠానం, ఆవాహిత దేవత హోమాలు, నిత్య బలిహరణ పూజలతో ఆరాధించారు. అదేవిధంగా కుంకుమార్చన మండపంలో కుంకుమార్చనలు, యాగశాలలో చండీహోమాలు కొనసాగాయి.
తరలివచ్చిన భక్తులు
అలంపూర్ క్షేత్ర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జోగుళాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడ తో క్యూలైన్‌ల వద్ద బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలు భక్తుల సందడితో రద్దీగా మారాయి. భక్తులకు ఆలయ అధికారులు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో అ న్నప్రసాదం కోసం భక్తులు వెచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సీఐ రవిబాబు ఆధ్వరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆయా శాఖల అధికారులు భక్తుల సేవలో నిమగ్నమ య్యారు.

శక్తిస్వరూపిణి.. బ్రహ్మచారిణి

శక్తిస్వరూపిణి.. బ్రహ్మచారిణి

శక్తిస్వరూపిణి.. బ్రహ్మచారిణి