
ముగిసిన రెండో దశ ఐసెట్ అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో సీట్ల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు పీయూలో రెండు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో మొదటి దశ అడ్మిషన్లు కల్పించిన ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రెండో దశ చేపట్టగా.. ఎంబీఏలో 60 సీట్లు ఉండగా 57 సీట్లు, అలాగే ఎంసీఏలో 60 సీట్లకు గాను 47 సీట్లు భర్తీ అయ్యాయి. మంగళవారం చివరిరోజు 30 మంది విద్యార్థులు పీయూలో రిపోర్టు చేసి అడ్మిషన్లు పొందారు. 18 సీట్లు ఖాళీగా ఉండడంతో మరోమారు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.