
900 కేజీల నల్లబెల్లం పట్టివేత
లింగాల: అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సోమవారం రాత్రి స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ జనార్ధన్ మంగళవారం తెలిపారు. మండల కేంద్రానికి సమీపంలోని మగ్దూంపూ ర్ చౌరస్తాలో వాహనంలో తరలిస్తున్న 900 కేజీ ల నల్లబెల్లాన్ని పట్టుకొని నల్లపోతుల హరీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తహసీల్దార్ పాండునాయక్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
లింక్ ఓపెన్..
రూ.3 లక్షలు మాయం
నాగర్‌కర్నూల్ క్రైం: ఫోన్‌కు వచ్చిన అపరిచిత లింక్ ఓపెన్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.3 లక్షలు సైబర్ నేరస్తులు చోరికీ పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితు డు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీ పురం రోడ్డులో నివాసం ఉంటున్న వసంత్ ఫో న్‌కు సైబర్ నేరగాళ్లు ఓ లింక్‌ను పంపించారు. ఈ క్రమంలో లింక్ ఓపెన్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం సైబర్ పోర్టల్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
చిన్నారుల
అశ్లీల చిత్రాలు ఫార్వర్డ్
● ముగ్గురిపై కేసు నమోదు
వెల్దండ: మండలానికి చెందిన చిన్నారి బాలబాలికల అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమా ల్లో ఫార్వర్డ్ చేసిన ముగ్గురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలి పారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు చూసినా.. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సా మాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా నిఘా విభాగం పనిచేస్తుందని తెలిపారు. వారి సమాచారం మేరకు ముగ్గురిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని సూచించారు.
రహస్యంగా మహిళల
వీడియోల చిత్రీకరణ
ధన్వాడ: మహిళలు స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని హన్మాన్‌పల్లి గ్రా మానికి చెందిన కుర్వ సత్తయ్య మంగళవారం ఉదయం ఓ మహిళ బాత్‌రూంకు వెళ్లగా పైన ఉన్న వెంటిలేటర్ కిటికీలో నుంచి వీడియో తీ శాడు. ఫోన్ ఫ్లాష్ లైట్ పడటంతో సదరు మహి ళ గుర్తించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా చేతిలో ఉన్న ఫోను జారి కిందపడగా.. వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధితులు ఈ విషయం భర్తకు చెప్పడంతో ఫోన్ ఎవరిది అని ఆరాతీయగా గ్రామానికి చెందిన కుర్వ సత్తయ్యగా గుర్తించారు. ఫోన్ అన్‌లాక్ చేసి చూడగా అందులో మరో ఆరుగురు మహిళలు బాత్‌రూం వెళ్లినప్పుడు తీసిన వీడియోలు ఉండటంతో వెంటనే ధన్వాడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ రాజశేఖర్ స్పందిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వివాహిత మృతి
అలంపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు.. పెబ్బేర్ మండలం చెలిమిల్లకు చెందిన నాగమణి(48) భర్త గోపాల్‌తో కలిసి బొంతల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం లింగన్‌వాయికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఊట్కూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సమీర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.