
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. నిరంతర ప్రాక్టీస్ ద్వారా క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఉందన్నారు. కేవలం ఎంపికలు ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయకుండా.. కొత్త మెళకువలు నేర్చుకోవడం ద్వారా రాణించేందుకు ఆస్కారం ఉందన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబర్చి తప్పకుండా యూనివర్సిటీకీ పతకాలు సాధించాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు మంచి శిక్షణ అనంతరం క్రీడల్లో పాల్గొనే విధంగా యూనివర్సిటీ వసతులు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పీడీసత్యభాస్కర్, శ్రీనివాస్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.