
ప్రజా సమస్యలపైనిరంతరం పోరు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజా సమస్యలపై చైతన్య మహిళ సంఘం నిరంతరం పోరాటం చేస్తోందని చైతన్య మహిళ సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీదేవి అన్నారు. తాటికొండలో మంగళవారం చైతన్య మహిళా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైతన్య మహిళ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, మహిళల హక్కుల సాధన కోసం పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. చైతన్య మహిళ సంఘం ఆవిర్భవించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏపీలోని ప్రొద్దుటూర్‌లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో ఆవిర్భవసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పెద్దఎత్తున మహిళలు హాజరు కావాల ని కోరారు. అనంతరం సభ కరపత్రాన్ని విడుదల చేసి సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కస్తూరి, దీపమ్మ, శాంత, మహేశ్వరి, పద్మ పాల్గొన్నారు.