
కవులు, కవయిత్రులకు నిలయం పాలమూరు
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రము ఖ కవలు, కవయిత్రులకు నిలయమని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీలాశక్తి పీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రావూరి వనజ అధ్యక్షతన మంగళవారం జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ భవన్‌లో సాహి తీ పురస్కారాల ప్రదానోత్సవంతో పాటు ఉపాధ్యా య సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ గంటా మనోహర్‌రెడ్డికి, పాకాలా యశోధారెడ్డి పురస్కారాన్ని తెలంగాణ జానపద సాహిత్య పరిషత్ అధ్యక్షులు చింతపల్లి వసుంధరారెడ్డిలకు అందజేశారు. మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డిలు దాదాపు 25 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పాకాల యశోధారెడ్డి తెలంగాణ యాసలో అద్భుతమైన రచనలు చేసి పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచారని అన్నారు. ఆకాశవాణి కేంద్రంలో మొట్టమొదట ప్రసంగాలు చేసిన తెలంగాణ మహిళ అని కొనియాడారు. ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ తిరుపతి కవులకు సమానమైన కవులు ఉన్న జిల్లా పాలమూరు అని పేర్కొన్నారు. అనంతరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, డాక్టర్ ప్రమీలారెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, బాలస్వామి, డాక్టర్ చందోజీ, డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి, మేకల అనురాధ, డాక్టర్ క్రిష్ణవేణి, కేఎల్.సత్యవతి, పద్మావతి, సక్కుబాయి, డాక్టర్ భారతి పాల్గొన్నారు.