
కుక్కలు ఎక్కువగా ఉన్నాయి
మా కాలనీలో ఎక్కడ బడితే అక్కడ వీధి కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయి. రాత్రివేళ గుంపులు గుంపులుగా ఒకచోట చేరి అరుస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. వీటిని వెంటనే పట్టుకుని కు.ని. శస్త్ర చికిత్సలు చేయించి సుదూర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుంది. ఇప్పటికై నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
– బుగిడి వనజ, గృహిణి,
భాగ్యనగర్ కాలనీ, మహబూబ్‌నగర్
గుంపులు గుంపులుగాతిరుగుతున్నాయి
మా కాలనీలో వీధికుక్కలు దాదాపు 30 వరకు గుంపులు.. గుంపులుగా సంచరిస్తున్నా యి. ఉదయం, రాత్రి వేళ రోడ్డుపైకి వచ్చి వెంబడిస్తున్నాయి. చేతిలో ఏమైనా వస్తువులతో కనిపిస్తే చాలు లాక్కుపోతున్నాయి. చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. వీటిని పట్టుకుని వ్యాక్సినేషన్ వేయించాలి. – సి.భారతి, గృహిణి,
ఎస్‌ఆర్ నగర్, మహబూబ్‌నగర్
నివారణ చర్యలుతీసుకుంటున్నాం
ఫిర్యాదులు అందుతున్న కాలనీలలో నిత్యం ప్రత్యేక బృందం ద్వారా వీధికుక్కలను పట్టుకుని మౌలాలిగుట్టలోని ఏబీసీసీకి తరలిస్తున్నాం. అక్కడ వాటికి కు.ని. శస్త్రచికిత్సలు చేసి ఐదు రోజుల తర్వాత తిరిగి వదిలివేస్తున్నార. జంతు సంరక్షణ చట్టం మేరకు వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దు. తమ పిల్లలను ఎప్పుడుబడితే అప్పుడు బయటకు పంపకుండా తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
●

కుక్కలు ఎక్కువగా ఉన్నాయి

కుక్కలు ఎక్కువగా ఉన్నాయి