
వైభవంగా నిర్వహిస్తాం: ఈఓ
జోగుళాంబ అమ్మవారి దేవీశరన్న నవరాత్రి ఉత్సవాలను నయనానందంగా నిర్వహిస్తామ ని ఆలయ కార్యనిర్వాహన అధికారిణి దీప్తి పేర్కొన్నారు. అలంపూర్ క్షేత్రంలోని కార్యాలయంలో ఈఓ సోమవారం దేవీశరన్న నవరాత్రి ఉత్సవాలపై మాట్లాడారు. జోగుళాంబ అమ్మ వారి ఆలయాల్లో శరన్ననవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. అమ్మవారు నవరాత్రులు నవరూపాల్లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ రోజు జోగుళాంబ మాతగా దర్శనమిస్తారన్నారు. భక్తులు, వీఐపీలకు ప్ర త్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30గంటల నుంచి 3:30 గంటల వరకు ఎలాంటి రుసుము లేకుండా కుంకుమార్చనలకు ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు తెలిపారు. సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గద్వాల సంస్థానదీశులు అందజేసిన చీరలతో తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అలంకరణ చేయనున్నట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో సాయంత్నం 5గంటల నుంచి 7గంటల వరకు సాంస్కృతిక సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.