కాపురానికి తీసుకెళ్లడం లేదని.. | - | Sakshi
Sakshi News home page

కాపురానికి తీసుకెళ్లడం లేదని..

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

వర్ధన్నపేట : తనను కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ఎదుట భార్య కుటుంబీకులతో కలిసి వంటా వార్పుతో నిరసన తెలిపిన ఘటన మండలంలోని ఇల్లందలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వరంగల్‌ నగరానికి చెందిన కందుకూరి సత్యనారాయణ, రోజారాణి దంపతుల కుమార్తె సుధీక్షను గతేడాది ఇల్లందకు చెందిన మాజోజు ఉదయ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచి సుధీక్షకు రూ.లక్ష అదనపు కట్నం కోసం భర్త, అత్తతో వేధింపులు మొదలయ్యాయి. గత నెలలో శ్రీరామనవమి సందర్భంగా ఇల్లందకు సత్యనారాయణ ఫలహారాలు ఇచ్చేందుకు రాగా ఉదయ్‌ కుటుంబీకులు వద్దంటూ దూషించారు. సత్యనారాయణ వెళ్లాక సుధీక్ష ఫిట్స్‌ బారిన పడడంతో వ్యాధిగ్రస్తురాలితో వివాహం జరిపించారంటూ గొడవ చేశారు. ఇరు కుటుంబాలు కలిసి సిద్దిపేటలో సుధీక్షకు నాటువైద్యం చేయించాయి. పెద్దల సమక్షంలో, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, హనుమకొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ చేసినా సుధీక్షను భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదు. దీంతో సుధీక్ష కుటుంబీకులతో నిరసనకు దిగింది. సుధీక్ష రాక తెలిసి ఉదయ్‌కుమార్‌ కుటుంబీకులు తాళం వేసి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement