విద్యుత్‌షాక్‌తో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో యువకుడి దుర్మరణం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

దేవరుప్పుల : హార్వెస్టర్‌ మరమ్మతులు చేసే క్రమంలో విద్యుత్‌షాక్‌ గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత శ్రవణ్‌కుమార్‌, ఎనగందుల వినయ్‌, చింత పవన్‌.. దండు రాజు (28)ను ఉదయం 10 గంటలకు గ్రామ శివారులో వరి చేను కోసే పని ఉందని తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో హార్వెస్టర్‌ మరమ్మతుకు గురవడంతో బేరింగ్‌ కట్‌ చేసేందుకు పక్కనే గల 11 కేవీ ఎల్‌టీ లైన్‌కు విద్యుత్‌ వైరు కలిపారు. ఈ క్రమంలోనే హార్వెస్టర్‌ పట్టుకుని ఉన్న రాజుకు విద్యుత్‌ షాక్‌ కొట్టిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే రాజును జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, తన భర్త రాజు మృతిపై అనుమానం ఉందనే భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement