ఇనుప సామాను దుకాణంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఇనుప సామాను దుకాణంలో అగ్నిప్రమాదం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

నయీంనగర్‌: నగరంలోని మాస్టర్‌ జీ స్కూల్‌ సమీపం ఈద్గా వెనుక ఉన్న పాత ఇనుప సామాను దుకాణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పివేశారు. దుకాణంలో ఉన్న అట్టలు, న్యూస్‌ పేపర్‌, ఫర్నిచర్‌ తగలబడడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల నుంచి విషపూరిత దట్టమైన పొగ వస్తున్నా ఫైర్‌ సిబ్బంది లెక్కజేయకుండా మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. హనుమకొండ పోలీసులు.. వాహనదారులు, ప్రజలకు ఇబ్బంది జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement