స్టేషన్‌ఘన్‌పూర్: గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుబోగీలో ఆదివారం రాత్రి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నుంచి వస్తున్న ఇంటర్‌సిటీ రైలు స్టేషన్‌ఘన్‌పూర్ సమీపానికి చేరుకోగానే రైల్వేస్టేషన్ దాదాపు కిలోమీటరు దూరంలోని డీ–8 బోగీలో పొగలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు చైన్‌లాగి రైలును ఆపారు. దీంతో రైల్వేగార్డు విషయం గమనించి బ్రేక్‌లు జామ్‌కావడంతో పొగలు వ్యాపించాయని, ప్రమాదం లేదని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని ఎక్కడంతో రైలు బయలుదేరింది. కాగా, స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్టాప్ ఉండడంతో అప్పటికే సమాచారం అందుకున్న స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక వాహనంతో అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో వారు తిరిగివెళ్లారు. ఏదిఏమైనా బ్రేక్‌ల జామ్‌తో రైలు బోగీలో పొగలు రావడంతో ఘన్‌పూర్‌లో మొత్తం 20 నిమిషాలను రైలును నిలపాల్సి వచ్చింది. బోగీ నుంచి పొగలు వ్యాపించడంతో రైల్వేస్టేషన్ వద్ద అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
భయాందోళనకు గురైన ప్రయాణికులు
స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో ఘటన


