‘షైన్‌’ విద్యార్థుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

‘షైన్‌’ విద్యార్థుల ప్రభంజనం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

కాజీపేట అర్బన్‌ : ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌ ఎంపీసీ, బైపీసీల్లో మొదటి ర్యాంకు సాధించి షైన్‌ ప్రభంజనం సృష్టించిందని షైన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ మూగుల కుమార్‌యాదవ్‌, డైరెక్టర్లు మూగుల రమ, అరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్‌ మూగుల రమేశ్‌యాదవ్‌ తెలిపారు. ఆదివారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌లో బి. లిఖితారెడ్డి 468, ఎ.శైలజ 467, ఒ.అర్చన 467, డి.దీక్షనందిని 467, ఎం.అక్షిత 467, జె.కావ్య 467తో పాటు 8 మంది 466 మార్కులు , బైపీసీ విభాగంలో కె.వైష్ణవి 437, పి.ఆసిని 436,జి.హర్షిణి 433, ముగ్గురు విద్యార్థులు 431 మార్కులు సాధించారని తెలిపారు. సెకండ్‌ ఇయర్‌ ఎంపీసీ విభాగంలో ఎం.దీక్షిత 995,కె.నిశాంత్‌ 995,ఎం.తేజస్వి 994,పి.శ్రీ సౌమ్య 991, సీహెచ్‌ విజయ్‌కుమార్‌ 991, ఆర్‌.అక్షయ 990, బైపీసీ విభాగంలో కీర్తన 992, ఎండీ అఖిబ్‌అలీ 989, ఎండీ.సాదుద్దీన్‌ 987 మార్కులు సాధించగా 25 మంది బైపీసీలో 970 మార్కులు 20 మంది విద్యార్థులు, ఎంపీసీలో 460 పైగా మార్కులు 45 మంది విద్యార్థులు, 15 మందికిపైగా 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో షైన్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ మారబోయిన రాజుగౌడ్‌, పి.శ్రీనివాస్‌, జి.ప్రశాంత్‌, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement