‘శివాని’ కళాశాల విశ్వరూపం | - | Sakshi
Sakshi News home page

‘శివాని’ కళాశాల విశ్వరూపం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

హసన్‌పర్తి: ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో కళాశాల విద్యార్థి నేరళ్ల రిషిత 995మార్కులు, లాకుంట్ల చక్రిక 994 మార్కులు, అలకుంట్ల నవ్య 994 మార్కులు, బక్క సంధ్య 994 మార్కులు, కనకం రంజిత్‌ 994 మార్కులు, సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో పి. సహస్ర శ్రీ 995 మార్కులు, జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో మేకల శ్రావ్య 468 మార్కులు, బీణవేణి అఖిలేష్‌యాదవ్‌ 467 మార్కులు, పాక రక్షిత 466 మార్కులు, కేసరి రితిక 466 మార్కులు సాధించారని శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్‌ తాళ్లపల్లి స్వామి తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో తాళ్లపల్లి వర్షిత 437 మార్కులు, బుద్దె వైష్ణవి 436 మార్కులు, మాలోత్‌ గాయత్రి 436 మార్కులు, సీఈసీ విభాగంలో జి. అజయ్‌ 485 మార్కులు సాధించారని తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈసందర్భగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ స్వామి, ప్రిన్సిపాళ్లు జి. సురేందర్‌రెడ్డి, చంద్రమోహన్‌, డైరెక్టర్లు టి.రాజు, ఎన్‌. రమేశ్‌, ఎ. మురళీధర్‌, వి. సురేశ్‌, ఎస్‌. సంతోష్‌రెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement