అథ్లెటిక్స్‌ మెన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ఖమ్మం | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ మెన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ఖమ్మం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: ములుగు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన 11వ తెలంగాణ ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 552 మంది అథ్లెట్లు పాల్గొన్న పోటీల్లో చాంపియన్‌షిప్‌ దక్కించుకోవడానికి 76 ఈవెంట్లలో వీరోచిత పోరాటం సాగించారు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా అథ్లెట్లు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకున్నారు. మహిళల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ముగింపు వేడుకలకు ములుగు డీవైఎస్‌ఓ ఎ.ధర్మనాయక్‌ హాజరై విజేతలకు పతకాలు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, టోర్నమెంట్‌ నిర్వాహకుడు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అసోసియేషన్‌ చీఫ్‌ కోచ్‌ ఎండీ గౌస్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ములుగు జిల్లా చైర్మన్‌ ఐలి చంద్రమోహన్‌గౌడ్‌, అధ్యక్షుడు లెక్కల రాజిరెడ్డి, కోశాధికారి రాజ్‌కుమార్‌, ఊర యుగేంధర్‌రెడ్డి, జగన్‌, మనోజ్‌కుమార్‌, రాజేశ్‌, లక్ష్మణ్‌, మధు, గోపాల్‌, రజినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళల చాంపియన్‌ భద్రాద్రి కొత్తగూడెం

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

Advertisement
 
Advertisement
Advertisement