జనగామ రూరల్: ఇంటర్ ఫలితాల్లో జనగామ పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజంనం సృష్టించిందని ఆ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు అన్నారు. ఆదివారం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో చిరుచునగండ్ల వర్షిత, సిరికొండ వెంకటేష్ 466/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించారన్నారు. దొంతుల హాసిని 465/470, దేవరబోయిన సాత్విక్, కావటి సిద్దు 464/470, బైరగోని మధురిమ, సందెనబోయిన సాహితీ, బాలింగల హర్షవర్ధన్ 463/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో బానోత్ తేజస్వి 436/440, మారపాక అఖిల 435/440, సీఈసీ విభాగంలో అయేషా సాధియా 481/500, ఒకేషనల్ విభాగంలో యాంగల్ల సిరి 461/500 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో మీసాల సాయి నిఖిల్ 991/1000, మోటికే మౌన్యశ్రీ 990/1000, బైపీసీ విభాగంలో బానోత్ ఆశ 984/1000, రాపాక అర్చన 982/1000 సీఈసీ విభాగంలో తూర్పాటి చరణ్ 965/1000, ఒకేషనల్ విభాగంలో భారతాల చంటి శ్రీశాంత్ 983/1000 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈసందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు, శ్రీనివాస్, అధ్యాపకుల బృందం అభినందించారు.


