ఇంటర్‌ ఫలితాల్లో ఇన్‌స్పైర్‌ స్టేట్‌ ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో ఇన్‌స్పైర్‌ స్టేట్‌ ఫస్ట్‌

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

హసన్‌పర్తి: ఎర్రగట్టు క్రాస్‌లోని ఇన్‌స్పైర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని తీగల శ్రేష్టిత ఎంపీసీలో 997 మార్కులతో రాష్ట్రస్థాయి ఫస్ట్‌ ర్యాంకు సాధించినట్లు చైర్మన్‌ తీగల భరత్‌గౌడ్‌ తెలిపారు.అలాగే, సాయిప్రియ 987 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఎంపీసీ ఫస్టియర్‌లో పోతరవేని అమూల్య 467 మార్కులు, తంగళ్లపల్లి భవ్య 462 మార్కులు, బైపీసీ ఫస్టియర్‌లో అర్చన 427 మార్కులు, షన్మయి 426 మార్కులు సాధించారని వివరించారు. సీఈసీ ఫస్టియర్‌లో కస్తూరి వైశాలి 483 మార్కులు, శ్రీజ 483 మార్కులు సాధించారని చెప్పారు. శిక్షణ విధానాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యార్థినుల అంకితభావంతో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు భరత్‌గౌడ్‌ వివరించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులను కళాశాల యాజమాన్య వర్గసభ్యులు సుంకరి శ్రీరాంరెడ్డి, తీగల రాజ్‌కుమార్‌, కోటి చింతల మమత, లాడే శివ అభినందించారు. కాగా, సివిల్‌ సర్వీస్‌ సాధించి ప్రజలకు సేవచేయడమే తన లక్ష్యమని స్టేట్‌ఫస్ట్‌ ర్యాంకు విద్యార్థిని తీగల శ్రేష్టిత తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement