
‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో ఎంతో మేలు
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
కర్నూలు కల్చరల్: ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం బీఏఎస్ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లా పర్యటనకు వస్తున్నారని, ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. సూపర్ జీఎస్టీపై కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రమేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.