
అగ్రహారంలో పట్ట పగలే చోరీ
● 3 తులాల బంగారం, రూ.10 వేల
నగదు అపహరణ
ఆలూరు రూరల్: మండలంలోని అగ్రహారం గ్రామంలోని ఓ ఇంట్లో పట్ట పగలే దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసం చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరణ చేశారు. గ్రామానికి చెందిన ఉరుకుందప్ప సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి తలుపులకు తాళాలు వేసి భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి చోరీ చేసిన విషయాన్ని గుర్తించాడు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆలయ భూమిలో అక్రమ మైనింగ్‌పై దాడి
బనగానపల్లె రూరల్: పలుకూరు గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 308లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై బనగానపల్లె భూగర్భ గనుల శాఖ ఆర్‌ఐ రెడ్డప్ప సోమవారం ఆకస్మిక దాడి చేశారు. దాడి విషయం ముందుగానే తెలుసుకున్న సుమారు ఆరుగురు మైనింగ్‌దారులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. వారిలో బాబాయి, లక్ష్మయ్య, నాగమయ్య, రాజన్నలు ఉన్నారని ఆలయ అర్చకులు భాస్కరయ్య తెలిపారు. ఆర్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, మైనింగ్‌దారులు పారిపోవడంతో ఎటువంటి స్వాధీనం జరగలేదని తెలిసింది. ఈ అక్రమ మైనింగ్‌పై కఠి న చర్యలు తీసుకోవాలని ఆలయ అర్చకులు మండల తహసీల్దార్‌ను కోరారు. ఈ దాడుల్లో వీఆర్‌ఐ, సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారి విగ్రహం అపహరణ
హాలహర్వి: దేవుళ్ల విగ్రహాలను సైతం దొంగలను అపహరిస్తున్నారు. పచ్చారపల్లి గ్రామంలోని సుంకులమ్మదేవి ఆలయంలో అమ్మవారి వెండి విగ్రహాన్ని అపహరించారు. అలాగే అమ్మవారి తాళిబొట్టు, ముక్కుపుడక, ఒకటిన్నర తులం బంగారాన్ని చోరీ చేశారు. సోమవారం ఉదయం అర్చకుడు దేవేంద్రప్ప ఆలయానికి పూజ చేయడానికి వెళ్లి చూడగా విగ్రహం కనిపించలేదు. దీంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే హాలహర్వి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మారుతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్నూలు నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అగ్రహారంలో పట్ట పగలే చోరీ

అగ్రహారంలో పట్ట పగలే చోరీ