
అహోజలం
అహోబిల క్షేత్రంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల అడవి పచ్చదనాన్ని పరుచుకోవడంతో పాటు ఎత్తైన కొండ చరియల్లోంచి నీటి ధారలు జాలువారుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎగువ అహోబిలం జ్వాలా నృసింహస్వామి సన్నిధి, ఉక్కు స్తంభం రహదారి వెంట జలపాతాలు ఉద్ధృతంగా కిందకు దూకుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నవనారసింహ స్వాముల దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకులు జల సోయగాలను చూస్తూ మురిసిపోతున్నారు. – ఆళ్లగడ్డ
రేపటి నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులకు అనుగుణంగా తేనెటీగల పంపకంపై రైతులకు ఈ నెల 8 నుంచి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యాన శాఖ, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా మొత్తం ఆరు బ్యాచ్‌లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. శిక్షణ పొందిన రైతులకు ఉద్యాన శాఖ తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తుందన్నారు. అదే విధంగా 50 శాతం సబ్సిడీపై బాక్స్‌లు కూడా అందిస్తామన్నారు. ఒక్కో బ్యాచ్‌లో 25 మందికి మాత్రమే అవకాశం ఉందని, అయితే ఇప్పటికే 160 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
యాగంటిని సందర్శించిన విదేశీయులు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని సోమవారం దక్షిణ కొరియాకు చెందిన ఐదుగురు దర్శించుకున్నారు. వీరు భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించుకుంటూ యాగంటికి చేరుకున్నారు. వీరు క్షేత్ర విశిష్టతలు తెలుసుకుని క్షేత్ర పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.
ఎగువ అహోబిలం కొండపై నుంచి
జాలువారుతున్న జలపాతాలు
కిందకు
దూకుతున్న
జలపాతం
క్షేత్రం ఎదుట జల పరవళ్లు,
మెట్ల మార్గంలో వరద ప్రవాహం

అహోజలం

అహోజలం

అహోజలం

అహోజలం