
ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
హొళగుంద: దేవరగట్టు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరాయి. కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవమూర్తులకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను, పల్లకీని నెరణికి గ్రామం ఊరువాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్దకు తీసుకొచ్చి అక్కడ కొలువుంచారు. దీంతో గ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది. గ్రామస్తులు ఆలయం నుంచి విగ్రహాలను అర్చకుల ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ మాళమల్లేశ్వరుని కంకణధారణతో నిష్టతో ఉన్న ప్రజలు సోమవారం దీక్షను విరమించారు.