
పత్తికొండ మార్కెట్‌లో విజిలెన్స్ తనిఖీలు
పత్తికొండ: విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పత్తికొండ మార్కెట్‌యార్డులో తనిఖీలు నిర్వహించారు. ధరలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కోనుగోలు విధానాలు, మార్కెటింగ్ అధికారుల పనితీరును పరిశీలించారు. ధరల హెచ్చుతగ్గుదలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సీ చౌడేశ్వరిదేవి ఆదేశాలు మేరకు తనిఖీ చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్‌తో ఉల్లి పంట
తొలగింపు
పత్తికొండ రూరల్: మార్కెట్‌లో ధర లేకపోవడంతో పందికోన గ్రామానికి చెందిన కస్తూరి రంగప్పరాజు అనే రైతు రెండెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్‌తో సోమవారం తొలగించాడు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టాడు. మార్కెట్‌లో క్వింటా ధర రూ.200 మాత్రమే ఉండటంతో కోత ఖర్చులు కూడా రాబోవని పండిన పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. దానిని గొర్రెల మంద వదిలాడు.

పత్తికొండ మార్కెట్‌లో విజిలెన్స్ తనిఖీలు