
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కర్నూలు కల్చరల్: అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అఽధికారులకు సూచనలు ఇచ్చారు. అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. సీఎం కార్యాలయ గ్రీవెన్స్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. డీఆర్‌వో వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అజయ్‌కుమార్, అనురాధ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండన్న తదితరులు పాల్గొన్నారు.