బేతంచెర్ల: ఆస్తి విషయంలో తల్లి, అక్కపై ఓ వ్యక్తి తన భార్య, అత్త, బావమరిదితో కలసి కత్తులతో దాడి చేసిన సంఘటన ఆర్. కొత్తపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న రామ మద్దయ్య, సుభద్రమ్మ దంపతులకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అప్పులు ఉండటంతో పొలం అమ్మాలని దంపతులు కొడుకు, కుమార్తెలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పొలం అమ్మ కూడదని కొడుకు శేఖర్, భార్య శ్యామల, బావమరిది నీలకంఠం మధు, అత్త పుల్లమ్మతో కలసి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. ఆ క్రమంలో అక్కలు లక్ష్మి, మాధవ లక్షమ్మ, సుజాత, రమాదేవిపై తమ్ముడు శేఖర్, బంధువులతో కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన లక్ష్మి, మాధవ లక్షమ్మను బేతంచెర్ల ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని వివరాల సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శేఖర్, నీలకంఠం, పుల్లమ్మ, శ్యామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.