
ముగిసిన రాష్ట్ర స్థాయి జలక్రీడలు
● సీనియర్స్, మిక్స్‌డ్ విభాగాల్లో
కర్నూలుకు పతకాలు
సీనియర్ బాయ్స్ విభాగంలో మొదటి స్థానం సాధించిన ఏలూరు జిల్లా జట్టు
జూనియర్స్ బాయ్స్ విభాగంలో రెండో స్థానం సాధించిన కర్నూలు జిల్లా జట్టు
కర్నూలు (టౌన్): మండలంలోని గార్గేయపురం చెరువులో రెండు రోజులు పాటు జరిగిన 4 వ రాష్ట్ర స్థాయి కెనోయింగ్‌అండ్ కయాకింగ్ డ్రాగన్ బోటో పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనంతరం నిర్వహించిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ఏపీఈ డబ్ల్యూ డీసీ డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర, రాష్ట్ర కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బలరాం నాయుడు అతిథులుగా హాజరై మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా 3 శాతం వినియోగించుకొని క్రీడాకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. కర్నూలులో మొట్టమొదటి సారిగా రాష్ట్ర స్థాయి వాటర్ స్పోర్ట్స్‌ను విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కెనోయింగ్ అండ్ కయాకింగ్ సంఘం వ్యవస్థాపకులు శివారెడ్డి, ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు :
జూనియర్స్ విభాగంలో...
200 మీటర్ల పురుషుల జూనియర్ విభాగంలో ఏలూరు (ప్రథమస్థానం), కర్నూలు (ద్వితీయ స్థానం) నంద్యాల (మూడో స్థానం)
సీనియర్స్ విభాగంలో...
కర్నూలు మొదటి స్థానం, ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం
మిక్స్‌డ్ విభాగంలో...
ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానం, కర్నూలు
రెండవ స్థానం, నంద్యాల తృతీయ స్థానం
500 మీటర్ల పురుషుల
జూనియర్స్ విభాగంలో....
ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం, కర్నూలు
ద్వితీయ స్థానం, నంద్యాల తృతీయ స్థానం
సీనియర్స్ విభాగంలో ...
ఏలూరు ప్రథమ స్థానం, నంద్యాల ద్వితీయ స్థానం, కర్నూలు మూడో స్థానం
మిక్స్‌డ్ విభాగంలో...
కర్నూలు ప్రథమ స్థానం, కృష్ణ జిల్లా ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా తృతీయ స్థానం దక్కించుకున్నాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి జలక్రీడలు