
స్కార్పియో బోల్తా – ఐదుగురికి గాయాలు
కొలిమిగుండ్ల: పెట్నికోట–నాయినిపల్లె గ్రామాల మధ్యలో ఆదివారం ప్రమాదవశాత్తు స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పెట్నికోట నుంచి కొలిమిగుండ్ల పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్న సమయంలో మార్గమధ్యలో వాహనం బోల్తాపడింది. పెట్నికోటకు చెందిన ఆంజనేయులు, కంబగిరి, నాయినిపల్లెకు చెందిన కృష్ణారెడ్డి, కోటపాడుకు చెందిన పెద్దన్నతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన వాహనాన్ని పైకి లేపి అందులో ఉన్న క్షతగాత్రు లను బయటకు తీశారు. వారిని 108లో కొలిమిగుండ్ల పీహెచ్‌సీకి తరలించారు. మైరుగైన చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పరామర్శించారు.