
జ్ఞాపకాల జడివాన
బనగానపల్లె రూరల్: ఇల్లూరుకొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జ్ఞాపకాల జడివాన కురిసింది. 21 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ పరవశించిపోయారు. 2003–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆర్గనైజర్లు మహబూబ్‌బాషా, ఇస్మాయిల్, షరీఫ్, ఓబులేసు, విజయ్, చంద్రుడు, షఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ దూర ప్రాంతంలో ఉన్న ఈ కార్యక్రమానికి హాజరై మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు రంగారెడ్డి, దాదాబాషా, సురేష్‌బాబు, పద్మావతి, వెంకటలక్ష్మీ, సుబ్బరాయుడు నారాయణ, రమేష్‌ను సన్మానించి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.