
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
● ఎనిమిది మందికి గాయాలు
బనగానపల్లె రూరల్: మండలంలోని టంగుటూరు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు–ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. నందివర్గం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన చిలకల రమేష్ కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌లో కై ప గ్రామంలోని బిజ్జి తిమ్మయ్య స్వామికి మొక్కబడి నిమిత్తం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్‌లో బయల్దేరారు. అయితే టంగుటూరు గ్రామంలోని పెద్దమ్మగుడి సమీపంలో ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ప్రమాదశాత్తు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న రమేష్ బంధువులు పుల్లయ్య, లక్ష్మీదేవి, మాధురి, లింగమ్మ, తిమ్మయ్య, కాశమ్మ, అబ్దుల్‌రహీం, దస్తగిరిలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.