
అదిగదిగో జీరంగి
జీరంగి..ఇప్పటి తరానికి మినహా అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల క్రితం పిల్లలు పొలాలు, కొండ గుట్టల వెంట తిరుగుతూ చెట్లపై ఉన్న జీరంగులను పట్టుకుని ఆడుకునే వారు. వీటిని అగ్గి పెట్టెలో దాచి తుమ్మ ఆకు వేసి దాచి పెట్టేవారు. ఇవి గుడ్లు పెడుతూ ఉంటే వాటిని చూసి సంతోషపడుతూ ఉండేవారు. వర్షాకాలం వస్తే చెట్లపై ఇవి విపరీతంగా కనిపించేవి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావంతో రోజురోజుకూ అంతరించి పోతున్నాయి. తుగ్గలి మండలంలోని ఆముదం పొలంలో ఆదివారం ఒకటి కనిపించింది. గంటల తరబడి ఏక ధాటిగా శబ్దం చేసింది. సూర్యుని కిరణాలు దీనిపై పడటంతో బాగా కనిపించింది. – తుగ్గలి