
20 కిలోల టమాట ధర రూ.50
ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్‌కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్‌లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్‌కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు.