
కష్టాలు.. కన్నీళ్లు!
● భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులు
కోసిగి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు కుళ్లి పోయి పూర్తి దెబ్బతిన్నాయి. రైతుల కష్టమంతా నేలపాలైపోయింది. ఉల్లి పంట బాగా కాపు కొచ్చి మంచి దిగుబడిని ఇచ్చింది. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దసరా పండుగ అయిన వెంటనే కోతలు కోసి పంటను అమ్ముకుందామనుకున్నారు. అయితే అంతలో భారీగా వర్షం కురువడంతో పొలాలలోనే ఉల్లి పంట మొలకులు వచ్చేసింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారు. కొందరు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి రోటవేటర్‌తో తొలగించారు. మరికొందరు పంటను తొలగించి దిబ్బలో పడేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు.