
ఆదర్శనీయుడు అంబేడ్కర్
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
పెద్దకడబూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆదర్శనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. కల్లుకుంట గ్రామంలో ఆదివారం నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్‌రెడ్డి మాట్లాడారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీ యుడన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిక్సూచి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రవిచంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి శివరామిరెడ్డి, రైతు విభాగం తాలూకా అధ్యక్షుడు యల్లప్ప, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, సర్పంచ్ ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ సత్యన్నగౌడ్, జైభీమ్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.