
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది.