
శ్రీమఠంలో భక్తి శ్రద్ధలతో దసరా వేడుకలు
మంత్రాలయం: విజయదశమి వేడుకలను శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర మూల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం శ్రీమఠంలో శమీ వృక్షానికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాష్ట్ర ఎస్‌ఈసీ మెంబర్ వై. సీతారామిరెడ్డి, జిల్లా కార్యదర్శి మురళీ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అలాగే మంత్రాలయం పాత ఊరులో వెలసిన మారికాంబ దేవాలయంలో సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్యతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పూజలు చేశారు.

శ్రీమఠంలో భక్తి శ్రద్ధలతో దసరా వేడుకలు