
టీబీ డ్యాం సమాచారం
పూర్తి మట్టం : 1,633 అడుగులు
ప్రస్తుతం : 1,626.06
టీఎంసీల సామర్థ్యం : 105.788
ప్రస్తుతం : 80.003
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 14,268
ఔట్‌ఫ్లో (క్యూసెక్కులు) : 13,961
జైత్రయాత్రలో చాలా మందికి తలలు పగిలాయి. ఈ కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. 40 మందికి పైగా తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి హెల్త్ క్యాంపులో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలుకు రెఫర్ చేశారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేవించిన వారే ఉన్నారు. మద్యంమత్తులో రింగు కర్రలు తగిలి, అగ్గి కాగడాలు మీద పడిన గాయాలయ్యాయి.
బన్ని ఉత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప (46)పై రింగు కర్ర లతో కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతునికి భార్య బసమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య బసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆదోనిలోని అరుణ జ్యోతి నగర్‌కు చెందిన ఆంజినేయ (48) బన్ని ఉత్సవాలు తిలకించేందుకు వచ్చి..తొక్కిసలాటలో ఊపిరాడక గుండెపోటుతో మృతి చెందాడు. ఈయనకు భార్య ఈరమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు.
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భాగంగా జైత్రయాత్ర దట్టమైన అడవిలోని ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ్ల వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంఛాబీర వంశానికి చెందిన బసవరాజు అనే గొరువయ్య ఎడమ కాలు పిక్కల నుంచి డబ్బణంను గుచ్చి వచ్చిన రక్తాన్ని మణి, మల్లాశురులుగా పిలిచే రాక్షస గుండ్లకు సమర్పించారు. ప్రతి ఏటా ఈ వంశస్తులే రాక్షస గుళ్లకు రక్తసంతర్పణ చేస్తారు. పాదాలగట్టు నుంచి 6 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ రక్షపడి ఉంటుంది. గతంలో ఇక్కడికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ భయపడే వారు. గత ఏడాది నుంచి అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించారు.
గాయపడిన భక్తులు
పగిలిన తలలు.. చిందిన రక్తం
ఇద్దరు మృతి
రాక్షస గుండ్లకు రక్తార్పణ

టీబీ డ్యాం సమాచారం

టీబీ డ్యాం సమాచారం

టీబీ డ్యాం సమాచారం