
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
మంత్రి కొల్లు రవీంద్ర
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్‌షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే భారత్‌కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు.
విజేతల వివరాలు...
హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం. కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరా ఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
పెనమలూరు: గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ చౌదరిపేటకు చెందిన వీరంకి పరమేశ్వరి తన అత్త సరస్వతిని స్కూటర్‌పై ఎక్కించుకుని ఆదివారం సాయంత్రం కానూరులో బావమరిది ఇంటికి వస్తుండగా గంగూరు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ పైనుంచి కిందకు పడిన మహిళలు ఇద్దరికీ గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.