
కృష్ణానదికి పెరిగిన వరద ప్రవాహం
ఇబ్రహీంపట్నం:ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరదనీరు వచ్చి చేరడంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. 3.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగటంతో ఇబ్రహీంపట్నం మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా చినలంక, పెదలంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పడవలను ఆశ్రయించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ రేవు వద్దకు చేరుతున్నారు. ఆర్డీఓ కావూరి చైతన్య ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం, ఫెర్రీ, చినలంక గ్రామాల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రవాహం అధికంగా ఉన్నందున నాటు పడవలు వాడవద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పడు సమాచారం అందించాలని రెవిన్యూ, మున్సిపల్ అఽధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్రక్ టెర్మినల్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రక్ టెర్మినల్ వద్ద గతంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ గదులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తహసీల్ధార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు.