
ఎగనామం
సూపర్ సిక్స్‌కు
సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో ఇళ్ల స్థలాల సాధన కోసం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారం దక్కిన తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారన్నారు. సొంత అజెండాతో పాలన సాగిస్తూ పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. మాట మార్చడం చంద్ర బాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.
– గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)