
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
కై లాస్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానా ల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కైవసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు శ్రీహరిరావు, విశ్వప్రసాద్‌రావు, భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావ్, సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అజ్మీరా శ్యామ్‌నాయక్, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.